సంక్రాంతికి ‘క్రాక్‌’

మాస్‌ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్‌ నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో వరలక్ష్మి, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. ఈ వేసవిలోనే సందడి చేయాల్సి ఉన్నా లాక్‌డౌన్‌కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఇటీవలే పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. ‍ ఒకపాట చిత్రీకరణ మినహా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయిందని చిత్ర బృందం తెలిపింది. 2021 సంక్రాంతి కానకగా థియేటర్లలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమాకు తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.