‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పతాక సన్నివేశానికి అన్ని కోట్లా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. పరిచయం అవసరం లేని తెలుగు సినిమా. ఈ చిత్రం గురించి ఏ చిన్న విషయమైనా సినీ అభిమానులకు ఆసక్తే. భారీ బడ్జెట్‌తో మల్టీస్టారర్‌గా రూపొందడంతో అందరి చూపు ఈ చిత్రంపైనే. తాజాగా ఓ అప్‌డేట్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే? ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్టు పతాక సన్నివేశానికి సిద్ధమైందట. సినిమా మొత్తానికి ఇదే హైలెట్‌గా ఉండబోతుందట. పతాక సన్నివేశాన్ని పోరాట నేపథ్యంలో ప్లాన్‌ చేస్తున్నాడట రాజమౌళి. ఇందుకు సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. మరి ఈ యాక్షన్‌ సన్నివేశం ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ చిత్రంతో బాలీవుడ్‌ నటి అలియా భట్, హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.