‘ఆకాశం నీ హద్దురా’ విడుదల మరింత ఆలస్యం కానుందా?

సింగం హీరో సూర్య -  సుధ కొంగర దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సురారై పొట్రు’. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. తెలుగులో చిత్రానికి ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుని ఖారరు చేశారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేయాలని సూర్య ప్రకటించాడు. దీంతో తమిళనాడు థియేటర్ల సంఘం యజమానులు అంతా ఒక్కటై ఇకపై థియేటర్లో సూర్య చిత్రాలను విడుదల చేయం అంటూ ప్రకటించారు. అయినప్పటికీ సూర్య మాత్రం చిత్రాన్ని అక్టోబర్‌ 30, 2020న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మరో సమస్య వచ్చింది కూర్చుంది. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదంటూ హీరో సూర్య ఓ లెటర్‌ని సామాజిక మాద్యమాల్లో విడుదల చేశాడు. ఆ లెటర్లో ఏముందంటే చిత్రానికి సంబంధించిన కొన్ని అనుమతులు ఇంకా పూర్తికాకపోవడం చేతనే అంటూ వివరించారు. దీంతో సూర్య అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇందులో మోహన్‌ బాబు తన అసలు పేరైన భక్తవత్సలం నాయుడుగా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్‌లు కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో అపర్ణ బాలమురళి, పరేష్ రావల్, కరుణస్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్, కాళి వెంకట్ తదితరులు నటిస్తున్నారు. తెలుగులో భాస్కరభట్ల రాసిన ‘‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి‘‘ అంటూ సాగే వీడియో ప్రోమో సాంగ్‌ ఆకట్టుకుంటోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.