అభిమానులకు సూర్య విజ్ఞప్తి

తమిళ నటుడు సూర్య నటించిన చిత్రం ‘కాప్పన్‌’ తెలుగులో ‘బందోబస్తు’ టైటిల్‌తో రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా ముందస్తు వేడుకను చెన్నైలో నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి హాజరైన సూర్య తన అభిమానులక ఓ విజ్ఞప్తి చేశారు. ‘నా చిత్రాల విడుదల సమయంలో హోర్డింగ్స్‌, కటౌట్లు పెట్టొద్ద’ని కోరారు. చెన్నైలో రోడ్డుపై ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ కూలడంతో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూర్య ఈ విషయం చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.