గాంధీ జయంతికి ‘సైరా’?

చిరంజీవి కథనాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సైరా’. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకణ ఆఖరి షెడ్యూల్‌ జరుపుకొంటోంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తారని ప్రకటించారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి తాజా విశేషం ఒకటుంది. దసరా కంటే ముందే ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గాంధీ జయంతి (అక్టోబర్‌ 2)న విడుదల చేసే ప్రయత్నాల్లో ఉందట చిత్రబృందం. అప్పుడు విడుదల చేస్తే శెలవులు ఎక్కువగా రావడం.. ఆ వెంటనే దసరా పండుగ రెండూ కలిసి వచ్చే అంశాలు. ఈ సినిమాలో నయనతార కథానాయిక, అమితాబచ్చన్, విజయ్‌ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.