కేసీఆర్‌ ‘ఉద్యమ సింహం’ వస్తోంది
తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఉద్యమ సింహం’. ఈ సినిమాలో కేసీఆర్‌ పాత్రని ప్రముఖ నటుడు నాజర్‌ పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మాత. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమం మొదలుకొని...రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే వరకు ఈ సినిమాలో సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈసినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్‌ సాధించింది. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.