తెలుగులోకి రాబోతున్న తమిళ ‘టెంపర్‌’

వి
శాల్‌ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కిన ‘అయోగ్య’, అదే పేరుతో తెలుగులో విడుదల కాబోతోంది. తెలుగు నిర్మాత ఠాగూర్‌ మధు తొలిసారి తమిళంలో నిర్మించిన చిత్రమిది. విశాల్‌ సరసన రాశిఖన్నా నటించింది. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవలే తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని, తెలుగులో మల్కాపురం శివకుమార్‌ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘కథానాయకుడు విశాల్‌ నటనే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని తమిళ ప్రేక్షకులు మెచ్చుకున్నారు. తెలుగులో జూన్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ’’న్నారు మల్కాపురం శివకుమార్‌. పార్తీబన్, సంతాన భారతి, ఎమ్‌.ఎస్‌.భాస్కర్, సోనియా అగర్వాల్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సామ్‌.సి.ఎస్, ఛాయాగ్రహణం: కార్తీక్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.