ఉత్కంఠభరితంగా నాని వీ ట్రైలర్‌

నేచరల్‌ స్టార్‌ నాని, సుధీర్‌బాబు కలిసి నటిస్తున్న చిత్రం వీ. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం ఈరోజు చిత్రబృందం ఈరోజు అధికారిక ట్రైలర్‌ని విడుదల చేసింది. ట్రైలర్లో నాని చెప్తున్న డైలాగ్‌లు ప్రేక్షకులు ఆకుట్టుకునేలా ఉన్నాయి. ‘‘వైలెంట్‌ సినిమాలంటే ఇష్టమా మీకు.. ఎలా ఫినిష్‌ చేద్దాం.. మళ్లీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మ్యాచ్‌ అవ్వలేదన్న మాట రాకూడదు’’ అంటూ నాని పలికిన సంభాషణలు ఆకట్టుకునే ఉన్నాయి. సుధీర్‌ బాబు ఇందులో పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీత స్వరాలు అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 5న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకొస్తుంది.  



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.