ఆలస్యంగా వకీల్‌ సాబ్‌?

రెండేళ్ల విరామం తరువాత పవన్‌ కల్యాణ్‌ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన సరికొత్త చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ పవర్‌ స్టార్‌ అభిమానులు ఆతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దీనికి మాటలు రాస్తున్నారు. ఇప్పటికే దీని ఫస్ట్‌ లుక్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘మగువ మగువ’ పాటకు అభిమానులు ఫిదా అయిపోయారు. మొదట ఈ చిత్రాన్ని మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాను జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.