విడుదలకి సిద్దమైన వ‌ల‌స‌

కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకం పై యెక్కలి రవీంద్ర బాబు నిర్మాణ సారథ్యంలో పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్నవలస చిత్రం‌ విడుదలకి సిద్ధమయ్యింది. గతంలో సొంతవూరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామజిక చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి యూత్ ఫుల్ చిత్రాల తో ప్రేక్షకులకి పరిచయమైన సునీల్ కుమార్ రెడ్డి ఈ చిత్రంతో, లొక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కోట్లాది వలస కార్మికుల జీవితాలపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ``ఏళ్ల తరబడి పని చేసి తాము నిర్మించిన ఈ నగరాలూ కూడా తమవే నన్న భావనతో ఉన్న వలస కార్మికులు, చిరు ఉద్యోగులు ఒక్క సారి కరోనా మహమ్మారి వల్ల విధించబడ్డ లాక్ డౌన్ తో ఒంటరి వారైపోయారు... ఉపాధినిచ్చిన నగరాలూ చెయ్యి వదిలివెయ్యడంతో దిక్కు తోచక తమ తమ గ్రామాలకి పయనమయ్యారు. వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడంతో వారు చేసిన పాదయాత్ర ఈ చిత్రం నేపథ్యం.! ఇది ఒక రోడ్ ఫిల్మ్. రోడ్డున పడ్డ శ్రామికుల కధ. వారి కలల కధ. వారి ఆవేదన.. వారి స్నేహం.. వారి ప్రేమ... వారికి ఎదురైన సంఘటనలు.. తారసపడ్డ మనుషులు....దేవతలు..రాక్షసుల దే ఈ కథ ``అన్నారు చిత్ర దర్శకుడు.

ఈ చిత్రం సమకాలీన చరిత్రకు అద్దం పడుతూనే ఒక మంచి ప్రేమ కధని చూపిస్తుంది ప్రేక్షకులకి వారి మనోగతాన్ని పరిచయం చేస్తూ...వారి నవ్వుల్లో వారి కేరింతల్లోని నిజాయితీని ఆస్వాదింపజేస్తుంది. సెన్సార్ కార్య‌క్రమాలని పూర్తి చేసుకొని అక్టోబర్ నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ చిత్రం ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను " అన్నారు చిత్ర నిర్మాత శ్రావ్యా ఫిలిమ్స్ పతాకంపై గతంలో నిర్మించిన క్రైమ్ సీరీస్ లో ప్రేక్షకులకి సుపరిచితులైన మనోజ్ నందం, వినయ్ మహాదేవ్ కథానాయకుడు గా నటిస్తుండగా వారికి జోడి గా తేజు అనుపోజు, గౌరీ అనే ఇద్దరు తెలుగు అమ్మాయిలు కధానాయికలుగా పరిచయమవుతున్నారు. కెమెరా మరియు ఎడిటింగ్ బాధ్యతలు నరేష్ కుమార్ మ‌డి నిర్వ‌హించ‌గా, ప్రవీణ్ ఇమ్మడి సంగీత సారధ్యం వహించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.