‘వాల్మీకి’ వచ్చేస్తున్నాడు..

తమిళంలో విజయవంతమైన చిత్రం ‘జిగడ్తాండ’. తెలుగులో ‘వాల్మీకి’ పేరుతో పునః నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్‌ కథానాయకుడు. పూజా హెగ్డే, మృణాళిని రవి కథానాయికలు. అధర్వ మురళి కీలక పాత్రధారి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. సెప్టెంబరు 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘మిరపకాయ్, గబ్బర్‌సింగ్, డీజే లాంటి చిత్రాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు హరీష్‌ శంకర్‌. కథానాయకుడి పాత్రని హరీష్‌ తీర్చిదిద్దే విధానం కొత్తగా ఉంటుంది. ‘వాల్మీకి’లోనూ అది చూడొచ్చు. ‘వాల్మీకి’ రీమేక్‌ అయినా... హరీష్‌ తనవైన మార్పులు చేర్పులు చేశారు. ఆ అంశాలన్నీ ఆకట్టుకుంటాయి. ‘తొలి ప్రేమ’, ‘ఫిదా’, ‘ఎఫ్‌ 2’ విజయాల తరవాత ‘వాల్మీకి’ కూడా వరుణ్‌కి గుర్తుండిపోయే చిత్రం అవుతుంద’’న్నారు నిర్మాతలు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళ: అవినాష్‌ కొల్ల, కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.