‘మిస్టర్‌ కెకె’ వస్తున్నాడు


విక్రమ్‌ కథానాయకుడిగా రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్‌ కె.కె’. అక్షర హాసన్‌, అభిహాసన్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళ చిత్రం ‘కదరమ్‌ కొండన్‌’కి అనువాద రూపమిది. టి.నరేష్‌ కుమార్‌, టి.శ్రీధర్‌ ఈ నెల 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టి.అంజయ్య సమర్పిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే థ్రిల్లర్‌ చిత్రమిది. ఎలాంటి సవాళ్లనైనా అవలీలగా ఎదుర్కొనే సమర్థవంతమైన కమాండర్‌గా విక్రమ్‌ కనిపిస్తారు. ట్రైలర్‌లో వినిపించిన ‘నువ్వు ఆడుతున్నది నాతో కాదు.. యముడితో’ అనే సంభాషణని బట్టే విక్రమ్‌ ఎలాంటి పాత్రలో నటించారో అర్థమవుతోంది. ఆయన గెటప్‌ ఇందులో ప్రత్యేకంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే, విజువల్స్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్షర హాసన్‌ నటనకి ప్రాధాన్యమున్న పాత్రలో కనిపిస్తారు. అందరినీ అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. త్వరలోనే విడుదల ముందస్తు వేడుకని నిర్వహించబోతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.