‘అయోగ్య’ విడుదల తేదీ ఖరారు

ప్రముఖ నటుడు విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అయోగ్య’. తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘టెంపర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను స్క్రీన్‌ సీన్‌ సంస్థ కొనుగోలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. సామ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.